Shiva karthikeyan | తమిళ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’ (Ayalaan). సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రానుండగా.. ఆర్.రవికుమార్ (R. Ravi Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ చూస్తే.. భూమి మీద ఉన్న జీవరాశులు విలన్ నాశనం చేయడానికి చూస్తుండగా.. భూమిని కాపాడడానికి ఏలియన్ దిగుతుంది. అయితే ఇండియాలో దిగిన ఏలియన్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. శివ కార్తికేయన్ లైఫ్‌లోకి ఏలియన్ ఎలా వచ్చింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) కథనాయికగా నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. పొంగళ్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.