HomeCinemaSharwanand Roped In After Nani Says No To Rajinikanths Next
రజనీకాంత్ చిత్రంలో శర్వానంద్
‘జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలను చర్చించే కథాంశమిదని, చక్కటి సందేశం మేళవించి ఉంటుందని చెబుతున్నారు.
‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలను చర్చించే కథాంశమిదని, చక్కటి సందేశం మేళవించి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల విరామం తర్వాత రజనీకాంత్-అమితాబ్‌బచ్చన్ కలిసి నటిస్తుండటం విశేషం.
ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో హీరో నాని నటించబోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే డేట్స్ సమస్యల కారణంగా ఆయన ఈ సినిమాకు అంగీకరించలేదని తెలిసింది. నాని స్థానంలో హీరో శర్వానంద్‌ను తీసుకోబోతున్నారని సమాచారం. కొంచెం నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర అయినప్పటికీ రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో తెరను పంచుకునే అవకాశం రావడంతో శర్వానంద్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.