Sharwanand | శర్వానంద్ ‘మనమే’ సినిమా జూన్ 7న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన తొలి పాట పెద్ద హిట్ అయింది. తాజాగా శనివారం రెండో పాటను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘మనమే..’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్‌ని కృష్ణకాంత్ రాయగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచారు. కార్తీక్, గీతా మాధురి ఆలపించారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీలో శర్వానంద్ వేసిన స్టెప్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని, కథానాయిక కృతిశెట్టి కూడా చాలా అందంగా ఉంటుందని వారు తెలిపారు.
శర్వా, కృతి శెట్టి కెమిస్ట్రీతోపాటు, బాలనటుడు విక్రమాదిత్యతో వారి బంధాన్ని కూడా ఈ పాట ఆవిష్కరించిందని వారు అన్నారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ, కెమెరా: విష్ణుశర్మ, జ్ఞానశేఖర్.