ఓటీటీలోకి వచ్చేసిన మహా సముద్రం.. నిన్న రాత్రి నుంచే స్ట్రీమింగ్

maha samudram in OTT | శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహా సముద్రం. అదితి రావు హైదరీ ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాదాపు పదేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటించిన సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 14న రిలీజైన మహా సముద్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మహా సముద్రం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అప్డేట్ లేకుండా డైరెక్ట్‌గా శనివారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కరోనా కారణంగా మహా సముద్రం సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు మొదట్లో భావించారు. ఇదే విషయమై ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరకు థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేశారు. కానీ తొలి రోజు నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో రూ.14 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన మహా సముద్రం సినిమా కేవలం 6.96 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసి బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. థియేటర్లలో నష్టపోయినప్పటికీ ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.11 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళం భాషల్లో మహా సముద్రం సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా మెప్పిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | శర్వానంద్‌ను రష్మిక గట్టెక్కిస్తుందా..?
మహా సముద్రం ఫైనల్ కలెక్షన్స్.. శర్వానంద్ కు భారీ డిజాస్టర్..
శర్వానంద్ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా..!
siddharth | గ్యాప్ రాలేదు నేనే తీసుకున్నా!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

