rave party | ఎన్సీబీ అదుపులో ఆర్యన్.. షూటింగ్ రద్దు చేసుకున్న షారుక్!
సంచలనం సృష్టించిన ముంబై రేవ్ పార్టీ( rave party )కి సంబంధించి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఓవైపు ప్రశ్నిస్తోంది.

ముంబై: సంచలనం సృష్టించిన ముంబై రేవ్ పార్టీ( rave party )కి సంబంధించి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఓవైపు ప్రశ్నిస్తోంది. మరోవైపు తనయుడు చిక్కుల్లో పడటంతో షారుక్ తన షూటింగ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పఠాన్ మూవీ చేస్తున్న షారుక్.. దీపికాతో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆర్యన్ ఎన్సీబీ అదుపులో ఉండటంతో అతడు ఈ షూటింగ్‌ను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. షారుక్ పెద్ద స్టారే అయినా.. ఆర్యన్ ఇన్నాళ్లూ లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. అయితే క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో అతడు ఉండటం సంచలనం రేపింది. అతనితోపాటు మరో బాలీవుడ్ యాక్టర్ కూతురు, ప్రముఖ వ్యాపారవేత్తల కూతుళ్లు కూడా ఉన్నట్లు తేలింది.
ఈ విచారణకు సంబంధించి ఎన్సీబీ అధికారులతో షారుక్ ఖాన్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాడు. డ్రగ్స్ పార్టీలో నేరుగా ఆర్యన్ పాత్ర ఉన్నట్లు ఇప్పటి వరకూ తేలలేదు. అయితే ఆర్యన్ కేసు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే.. షారుక్ తన పఠాన్ మూవీ షూట్‌ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై షారుక్ ఎలాంటి ప్రకటనా చేయకపోవచ్చని అతని కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కొడుకు ఎన్సీబీ అదుపులో ఉన్నాడన్న వార్త విని షారుక్ భార్య గౌరీ ఖాన్ షాక్ తిన్నారు. ఆమె కూడా తన ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నా.. ఇప్పుడా టూర్‌ను రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

