నమ్మలేని నిజాలు
తల్లీబిడ్డల మధ్య బంధం.. సృష్టిలోనే అత్యంత స్వచ్ఛమైనది. బిడ్డ కోసం తల్లి తన సర్వస్వాన్నే ధారపోస్తుంది. అలాంటి బిడ్డే దూరమైతే.. ఆమె ఎంతవరకైనా వెళ్తుంది. ఎవరితోనైనా.. ఎంతకాలమైనా పోరాడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే.. మిస్టరీ థ్రిల్లర్ జానర్లో రూపొందిన హిందీ వెబ్‌సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్'. నెట్ ఫ్లిక్స్ వేదికగా.. తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చింది.
షాక్: ట్రస్ట్ నో వన్
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతోంది.
తారాగణం: పరిణీతి చోప్రా, తాహిర్ రాజ్ భాసిన్, సుమిత్ వ్యాస్, హర్లీన్ సేథీ, అనూప్ సోని, ధృవ్ చౌదరి తదితరులు, దర్శకత్వం: రెన్సిల్ డిసిల్వా
కథలోకి వెళ్తే.. అన్విత (పరిణీతి చోప్రా), అలోక్ దత్ (తాహిర్ రాజ్ భాసిన్) దంపతులు. సిమ్లాలో వాళ్ల జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. అన్వితకి నెలలు నిండటంతో.. వారి కుటుంబానికి సన్నిహితుడైన డాక్టర్ భాస్కర్ హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడే ఆమె ఒక పాపకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు ‘అపేక్ష’ అనే పేరు పెట్టాలని అనుకుంటారు అలోక్ దంపతులు. అయితే, ఊహించని విధంగా హాస్పిటల్ నుంచి ‘అపేక్ష’ కనిపించకుండా పోతుంది. ఈ క్రమంలో హాస్పిటల్‌కి సంబంధం లేని ఒక మహిళ.. నర్స్ వేషంలో వచ్చి పాపని తీసుకెళ్లిపోయిందనే విషయం వారికి తెలుస్తుంది.
అయితే, సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయక పోవడంతో.. ఆ మహిళ ఎవరనేది కనుక్కోలేకపోతారు. చూస్తుండగానే ఎనిమిదేండ్లు గడిచిపోతాయి. అన్విత-అలోక్ దంపతులకు మరోపాప పడుతుంది. అయినా.. అన్విత మాత్రం ‘అపేక్ష’ జ్ఞాపకాలతోనే ఉంటుంది. తన మొదటి బిడ్డ బతికే ఉందనీ, అపేక్ష ఆచూకీ ఎప్పటికైనా తెలుస్తుందనే నమ్మకంతో ఉంటుంది. బిడ్డ కోసం పరితపించే అన్వితను.. చుట్టుపక్కల వాళ్లు, ఇంట్లో వాళ్లు కూడా పిచ్చిదానిలా చూస్తుంటారు. మరోవైపు అన్విత అత్త మాధురి.. తరచూ ఒక మాంత్రికుడిని కలుస్తుంటుంది. ఎవరికీ తెలియకుండా అతనితో క్షుద్రపూజలు చేయిస్తుంటుంది.
ఇలా ఉండగా.. గౌరవ్ – సాక్షి దంపతులు సిమ్లాకి కొత్తగా వస్తారు. వాళ్ల పాప ‘రియా’ను చూడగానే.. అన్వితకి అనుమానం కలుగుతుంది. ఆమె తన కూతురు అపేక్షే అయి ఉంటుందని.. వాళ్లను సందేహిస్తూ ఉంటుంది. అయితే, అపేక్ష కోసం మొదలుపెట్టిన అన్వేషణలో.. అన్విత కుటుంబానికి సంబంధించిన ఎలాంటి నమ్మలేని నిజాలు బయటపడతాయి? అసలు అపేక్షను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అన్విత అత్త.. ఎందుకని క్షుద్రపూజలు చేయిస్తుంది? గౌరవ్-సాక్షి దంపతుల పాప.. నిజంగానే అన్విత బిడ్డేనా? బిడ్డ కోసం అన్విత చేసే పోరాటం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

