Chandramohan | సినిమా పరిశ్రమలో వారసులకు కొదువేలేదు. ఎంతో మంది నటులు తమ వారసులను వెండి తెరకు పరిచయం చేశారు. ఒక్కో ఫ్యామిలీ ఐదారుగురు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. అయితే 175 సినిమాల్లో హీరోగా, మొత్తంగా 900కుపైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ (Chandramohan)మాత్రం తన వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేయలేదు. ఆయన కుటుంబం నుంచి ఒక్కరు కూడా సినిమాల్లోకి రాలేదు. ఎందుకంటే..
చంద్రమోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు చూడటానికి చక్కగా అందంగా ఉంటారు. అయినా వారిపై సినిమా ప్రభావం పడకుండా పెంచానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. వాళ్లను చిన్నప్పుడు చూసిన నటి భానుమతి.. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు, బాల నటులుగా పరియం చేద్దామని తనని అడిగారని, కానీ తాను తిరస్కరించానని తెలిపారు. వాళ్లకు సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళ్తావని అడుగుతారని భయం వేదని.. అందుకే ఎప్పుడూ తీసుకెళ్లలేదన్నారు. ఇద్దరూ చదువుల్లో రానించారని, గోల్డ్ మెడల్స్ కూడా అందుకున్నారని వెల్లడించారు.
ఇంతకీ ఆయన కూతుర్ల పేర్లేంటో తెలుసా.. మధుర మీనాక్షి, మాధవి. మీనాక్షి సైకాలజిస్టుగా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.