Selfish Movie Special Poster | టాలీవుడ్ అగ్ర నిర్మాత శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా.. ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సెల్ఫిష్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. విశాల్ కాశీ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా సోమవారం ఆశిష్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఆయన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
రంగురంగుల కాస్ట్యూమ్‌లో దిల్‌పై చేయి పెట్టుకుని మురిసిపోతున్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో పాటుగా దిల్కుష్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్‌ను సాయింత్రం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు కాస్తో కూస్తో పాజిటీవ్ బజ్నే క్రియేట్ చేశాయి. పైగా సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు సహ నిర్మాతగా కూడా ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో ఆశిష్ రెడ్డికి జోడీగా లవ్‌టుడే భామ ఇవానా నటిస్తుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Team #Selfish wishes the
Energetic Hero @AshishVoffl a very Happiest Birthday❤️#HappyBirthdayAshish ✨– https://t.co/fcV5Ks0kqx#DilKush Full Song Today at 3:33 PM 🎶@_Ivana_official @aryasukku #DilRaju #KasiVishal @MickeyJMeyer @SVC_official @SukumarWritings @adityamusic pic.twitter.com/flDHNYL0ZK
— Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2023