Jetlee Release Trailer | రితేష్ రాణా మార్క్ కామెడీ థ్రిల్లర్.. సత్య ‘జెట్లీ’ నుంచి కొత్త ట్రైలర్
Jetlee Trailer | మత్తు వదలరా పార్ట్ 1,2 చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సత్య హీరోగా, విలక్షణ దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన తాజా చిత్రం 'జెట్లీ'.
Jetlee Trailer | మత్తు వదలరా పార్ట్ 1,2 చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సత్య హీరోగా, విలక్షణ దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన తాజా చిత్రం ‘జెట్లీ’. ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా కొత్త ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. అ ట్రైలర్ చూస్తుంటే కథను మొత్తం ట్రైలర్లోనే రివీల్ చేసినట్లు తెలుస్తుంది.
సత్య తనదైన టైమింగ్ మరియు మేనరిజమ్స్తో పూర్తిస్థాయి హీరోగా మెప్పించబోతున్నాడు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష మరియు అజయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చెర్రీ నిర్మించిన ఈ చిత్రానికి కాలా భైరవ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సెన్సార్ నుంచి ఇప్పటికే U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం, సమ్మర్ కానుకగా మే 1, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమైంది. సత్య మార్క్ కామెడీ మరియు రితేష్ రాణా స్టైలిష్ టేకింగ్ కలగలిసిన ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

