Sapta Sagaralu Dhaati | ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది సప్త సాగరాలు దాటి సైడ్ ఏ. ఇద్దరు ప్రేమికుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఒక చిన్న తప్పును మీద వేసుకోవడం ద్వారా ఇద్దరి ప్రేమికుల జీవితాలు ఎలా మారిపోతాయనే చిన్న అంశంతో వచ్చిన ఈ సినిమా మనసులను తాకింది. ముఖ్యంగా రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ నటన ఆడియన్స్‌ను కథలో లీనమయ్యేలా చేశాయి. అందుకే ఈ సినిమా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే సప్త సాగరాలు దాటి సైడ్ బి చిత్రం గత ఏడాది నవంబర్ 17న థియేటర్లోకి వచ్చింది. అయితే 28 రోజుల్లోనే అంటే డిసెంబర్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఇలా పలుమార్లు వాయిదా పడటంతో సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఆడియో అందుబాటులో ఉంది.