Sankranthiki Vasthunam OTT | విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకేసారి అటు టీవీతో పాటు ఓటీటీలో విడుదల చేసింది. జీటీవీలో నిన్న ప్రీమియర్ అయిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీ వేదిక జీ5లో తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
Laugh out loud with this hilarious comedy thriller “Sankranthiki Vasthunam”
Streaming Now in Malayalam | Hindi | Tamil | Kannada | Telugu@VenkyMama @AnilRavipudi @aishu_dil @Meenakshiioffl#BheemsCeciroleo #Dilraju #Shirish @YoursSKrishna #SameerReddy#Tammiraju @prakash3933 pic.twitter.com/7lvvRWsUqy
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 2, 2025