యువ హీరో సంగీత్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బుధవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సంగీత్శోభన్ తాజా చిత్రాల అప్డేట్స్ను మేకర్స్ వెల్లడించారు. అగ్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో సంగీత్శోభన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
Pranay Raoదీనిద్వారా ప్రణయ్‌రావు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కామెడీ ప్రధానంగా మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు.

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాతలు. ఇందులో సంగీత్శోభన్ మధ్యతరగతి యువకుడు మారుతి పాత్రలో కనిపిస్తాడని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే చిత్రమిదని మేకర్స్ తెలిపారు.