నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌పై దృష్టి పెట్టింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఫీ మేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టులు శాకుంతలం, యశోదలో నటిస్తుండగా..వీటిలో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో హాట్‌హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నిన్ను కోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ (Siva Nirvana) డైరెక్షన్ లో విజయ్‌దేవరకొండ (Vijay Devarakonda) ఓ సినిమా చేయాల్సి ఉండగా..ఇంకా మొదలు కాలేదు.
మరోవైపు పూరీ జగన్నాథ్‌తో చేస్తున్న జనగణమన సినిమా కోసం లొకేషన్ల వేట నడుస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో శివనిర్వాణతో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడట. కియారా అద్వానీతోపాటు మరికొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత ఫైనల్ గా సమంతను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తోంది.
ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీకి సంబంధించిన కొత్త వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. మహానటి చిత్రంలో సమంత,విజయ్ దేవరకొండ కలిసి నటించిన విషయం తెలిసిందే. మరోసారి ఈ జోడి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుందనడంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.