Samantha | ‘కెప్టెన్ మార్వెల్ నాకు అత్యంత ఇష్టమైన సూపర్‌హీరో. ఈసారి ముగ్గురు శక్తివంతమైన సూపర్‌హీరోలు చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పాల్గొంటున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ‘ది మార్వెల్స్’ చిత్రం ఈ నెల 10న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది సమంత.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘మార్వెల్ ఇండియాతో కలిసి ప్రయాణం చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ‘ది మార్వెల్స్’ ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. ఈ దీపావళికి పెద్ద స్క్రీన్‌పై ఈ సినిమా చూడాలని ఉత్సాహంగా ఉంది’ అని పేర్కొంది. ‘ఖుషీ’ తర్వాత తెలుగులో మరే చిత్రాన్ని అంగీకరించలేదు సమంత. హిందీలో మాత్రం వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది.