Samantha | 18 ఏళ్ల వయస్సులో ఫస్ట్ టాటూ.. అతను పెళ్లి చేసుకుంటాడనే వేసుకున్నానన్న సమంత
Samantha |టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అనూహ్యంగా అతని నుండి విడిపోవడం అభిమానులని చాలా బాధించింది. చూడ చక్కటైన జంట విడిపోవల్సిన పరిస్థితి ఏంటి అనే దానిపై చాలా మంది ఆరాలు తీసారు కాని ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు
Samantha |టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అనూహ్యంగా అతని నుండి విడిపోవడం అభిమానులని చాలా బాధించింది. చూడ చక్కటైన జంట విడిపోవల్సిన పరిస్థితి ఏంటి అనే దానిపై చాలా మంది ఆరాలు తీసారు కాని ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందని త్వరలో ఆయనని రెండో వివాహం చేసుకోనుందంటూ ప్రచారం నడుస్తుంది. అయితే సమంత గురించి ఈ మధ్య నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అమ్మడికి సంబంధించి ఏదో ఒక విషయం హాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా సమంత టాటూకి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన మొదటి టాటూ గురించి మాట్లాడింది. “నేను 18 ఏళ్ల వయసులో టాటూ వేసుకున్నా. అప్పుడంటే నేను ప్రేమలో ఉన్నాను, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని భావించా. అందుకే టాటూ వేసుకున్నాను. అయితే, ఆ టాటూ ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పనని స్పష్టం చేసింది . ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని కూడా పేర్కొంది. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు. ప్రస్తుతం సమంత కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
గతంలో సమంత మెడ వెనుక “YMC” టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం ఓ వీడియోలో టాటూ కనిపించలేదు. దాంతో అందరు ఆ టాటూ చెరిపేసింది అనుకున్నారు. కాని ముంబైలో జిమ్ నుండి బయటకు వస్తున్న సమయంలో తీసిన ఫోటోలలో ఆ టాటూ ఇంకా స్పష్టంగా కనిపించింది. సమంత తన శరీరంపై మొత్తం మూడ్ టాటూలను వేసుకున్నారు. YMC అనే టాటూ ‘Ye Maya Chesave’ మూవీకి గుర్తుగా , నాగ చైతన్యకు సంబంధించి ప్రేమకి గుర్తుగా ఓ టాటూ, బాణాల టాటూ ఒకటి వేయించుకుంది. ఇది “మీ స్వంత వాస్తవికతను సృష్టించుకోండి” అనే భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే నిర్మాతగా మారి ‘శుభం’ సినిమా చేసింది. ఇందులో క్యామియో పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం “మా ఇంటి బంగారం” చిత్రంలో నటిస్తోంది, అలాగే “రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

