అంతకంటే అదృష్టమా?
అగ్ర కథానాయిక సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విశేషాల్ని పంచుకోవడంతో పాటు ఫిజికల్ వర్కవుట్స్ తాలూకు వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటుంది. ఇటీవల ఎక్కువగా తాత్విక భావాలు స్ఫురించే కొటేషన్స్‌ను పోస్ట్ చేస్తూ తన అంతరంగాన్ని అభిమానుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నది. సోషల్‌మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌ను ఏమంత సీరియస్‌గా తీసుకోదు సమంత. అవసరమైతే కాస్త వ్యంగ్యాత్మక ధోరణిలో తన స్పందన తెలియజేస్తుంటుంది. తాజాగా ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన కామెంట్‌కు అదే రీతిలో సమాధానమిచ్చింది.
తన పెంపుడు కుక్కలతో తీసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత. దీనిపై ఓ నెటిజన్ ‘నీ ఒంటరి జీవితం మొత్తం వీటితోనే అంతమైపోయేటట్లు ఉంది’ అని కామెంట్ చేశాడు. ‘అదే జరిగితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది?’ అంటూ సమంత అతనికి సమాధానమిచ్చింది. వ్యంగ్యంతో కూడిన ఆ మాటలతో సమంత సదరు నెటిజన్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిందని ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘యశోద’ ‘ఖుషి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

