అదొక అద్భుతం
సమంత మంచి నటి.. అద్భుతమైన అందగత్తె.. స్వతంత్య్రభావాలున్న వనిత.. సేవాదృక్పథంలో మేటి. వీటితోపాటు తనలో గొప్ప సమీక్షకురాలు కూడా ఉందని రీసెంట్గా పెట్టిన ఓ పోస్ట్ ద్వారా తేటతెల్లమైంది. ఇటీవలే ఆమె మమ్ముట్టి మలయాళంలో స్వీయనిర్మాణంలో నటించిన ‘కాదల్-ది కోర్' సినిమాను చూసింది.
సమంత మంచి నటి.. అద్భుతమైన అందగత్తె.. స్వతంత్య్రభావాలున్న వనిత.. సేవాదృక్పథంలో మేటి. వీటితోపాటు తనలో గొప్ప సమీక్షకురాలు కూడా ఉందని రీసెంట్గా పెట్టిన ఓ పోస్ట్ ద్వారా తేటతెల్లమైంది. ఇటీవలే ఆమె మమ్ముట్టి మలయాళంలో స్వీయనిర్మాణంలో నటించిన ‘కాదల్-ది కోర్’ సినిమాను చూసింది. స్వతహాగానే భావోద్వేగాలను ఆపుకోలేని వ్యక్తి కావడం చేత, ఆ సినిమా గురించి ఓ ఎమోషనల్ పోస్ట్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సమంత. ‘ఈ ఏడాది ఉత్తమచిత్రం ‘కాదల్-ది కోర్’. ఈ సినిమా ఫీల్ నుంచి బయటకు రాలేకపోతున్నా. మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. మమ్ముట్టిసార్.. మీరే కళ్లముందు కదులుతున్నారు.
అందరూ ఈ సినిమా తప్పక చూడాలి. ‘కాదల్-ది కోర్’ ఓ అద్భుతం’ అని చివరిగా ‘జ్యోతికా..లవ్యూ’ అంటూ పోస్ట్‌ని ముగించింది. సమంత పెట్టిన ఈ పోస్ట్‌తో మమ్ముట్టి ‘కాథల్ -ది కోర్’ చిత్రానికి ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మమ్ముట్టి సొంత సంస్థను స్థాపించి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ‘కన్నూన్ స్కాడ్’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఆయన.. ‘కాదల్-ది కోర్’తో నెలల వ్యవథిలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి స్వలింగసంపర్కునిగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

