అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరనే విషయం తెలిసిందే. రొటీన్‌కు భిన్నంగా ఉండే పాత్రలని ఎంపిక చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్న సమంత ఇటీవల డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత తన నటనతో అదరగొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడి జోరు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది.
సమంత పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ షో విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అవసరానికి మించి అందాలు ఆరబోస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈ అమ్మడు వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తూ అబ్బాయిల మతులు పోగొడుతుంది. సమంతని ఇలా చూసి నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏమందం సామ్ నిన్ను చూసాక మా గుండెజారి గల్లంతైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైన పెళ్లి తర్వాత కూడా సమంత తన గ్లామర్ విషయంలో హద్దులు దాటుతూనే ఉంది.