బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కొన్ని దశాబ్ధాలుగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాలంటే ఇప్పటికీ అభిమానులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సల్మాన్ తన చిత్రాలని దాదాపు ఈద్‌కి రిలీజ్ చేస్తుంటాడు.
అయితే సల్మాన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గామారింది. కొన్ని నిమిషాల యాడ్ కోసమే సల్మాన్ 50 లక్షలు పారితోషికం తీసుకుంటున్నారట. ఇలా ఓ స్టార్ హీరో చిన్న యాడ్ కోసం 50 లక్షలు ఛార్జ్ చేస్తుండడం ఇదే తొలిసారి అంటున్నారు. మరో వైపు బిగ్ బాస్ షో కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ నడుస్తుంది.
బిగ్ బాస్ సీజన్4 నుండి సీజన్6 వరకు రెండున్నర కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న సల్మాన్ ఖాన్.. సీజన్ 7 నుండి డబుల్ చేసేసాడు. బిగ్ బాస్ 13 కోసం పదమూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు బిగ్ బాస్ 15 కోసం 14 వారాలకు గాను 350 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడని సమాచారం. అంటే ఆయన ప్రతి వారానికి పాతిక కోట్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది.