చిరు చిత్రంలో సల్మాన్
అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్'. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్' రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్
అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి వెల్లడించారు. సినిమా సెట్లో సల్మాన్ రాగానే చిరంజీవి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ…‘భాయ్, సల్మాన్ ఖాన్‌కు స్వాగతం. మీ రాక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మీతో తెరను పంచుకోవడం సంతోషంగా ఉంది. మీరు సినిమాలో కనిపిస్తే చాలు ప్రేక్షకులకు కిక్ వస్తుంది’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతున్నది. నయనతార నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, సంగీతం : ఎస్ థమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

