Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకోగా.. తాజాగా మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
చెప్పినట్లుగానే సలార్ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఈ ట్రైలర్ సాగింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు దేవ (ప్రభాస్), వరద (పృథ్విరాజ్ సుకుమారన్) బద్ధ శత్రువులుగా మారే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ ప్రభాస్ రోల్‌ని ఫుల్ హైలెట్ చేసిందని చెప్పుకోవచ్చు.
మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న విడుదల కానుండగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో పోషించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించాడు.