Salaar | ఈ నెల 20న ఓటీటీలోకి సలార్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
బాహుబలి తర్వాత ‘సలార్’తో (Salaar) రెబల్‌స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టమీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది.
హైదరాబాద్: బాహుబలి తర్వాత ‘సలార్’తో (Salaar) రెబల్‌స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టమీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సీస్వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి చిత్ర యూనిట్ శుభవార్త అందించింది.
ఈ నెల 20న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ బ్లాక్‌బస్టర్‌ను స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రుతిహాసన్, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘సలార్’ సీక్వెల్ టైటిల్‌ను ‘పార్ట్-1’ చివర్లో రివీల్ చేశారు. మొదటి భాగాన్ని ‘సలార్-పార్ట్-1 సీజ్ఫైర్’ పేరుతో విడుదల చేయగా, రెండో భాగానికి ‘సలార్-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

