Salaar Movie | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఇక ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే.. 17 రోజుల్లో రూ.687 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్తో సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సలార్ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సందడి చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The blockbuster success calls for a BLOCKBUSTER CELEBRATION! 💥 #SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG… pic.twitter.com/muasXD2tnA
— Vamsi Kaka (@vamsikaka) January 8, 2024