Salaar Movie | బాహుబలి తర్వాత ‘సలార్’తో ( Salaar) ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రెబల్‌స్టార్ ప్రభాస్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టామీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ అంటూ రాగా.. సలార్: పార్ట్ 2-శౌర్యంగ పర్వం అంటూ రాబోతుంది. అయితే పార్ట్ 2 అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు అయితే సెట్స్ మీదకి వెళ్లలేదు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఏమైందో తెలీదు కానీ సడెన్‌గా ప్రభాస్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అంతా అన్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ సినిమా కాకుండా ప్రభాస్ కూడా వేరే మూవీ ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు కౌంటర్‌గా మూవీటీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. సలార్ ఆగిపోయింది అని వస్తున్న వార్తలు అబద్దం. ఇవీ ఫేక్ సలార్ సెట్స్‌లో ప్రభాస్- ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు ‘వారు నవ్వకుండా ఉండలేరు’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది.
They can’t stop laughing 😁
#Prabhas #PrashanthNeel#Salaar pic.twitter.com/FW6RR2Y6Vx
— Salaar (@SalaarTheSaga) May 26, 2024