Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Kareena Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడికి సంబంధించి ఆయన సతీమణి, ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
Kareena Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడికి సంబంధించి ఆయన సతీమణి, ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. గతంలో సైఫ్ నివాసంలో జరిగిన ఈ దుర్ఘటన బాలీవుడ్‌ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. దాడి జరిగిన ఆ తెల్లవారుజామున అసలేం జరిగిందో కరీనా కపూర్ వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ రాత్రి తాను వేసుకున్న నైట్ టీషర్ట్‌తోనే ఎలాంటి హంగులూ లేకుండా రోడ్డుపైకి పరిగెత్తి సహాయం కోసం అరిచానని తెలిపారు. రక్తంతో తడిసిముద్దయిన సైఫ్‌ను కాపాడుకునేందుకు దారిలో వెళ్లే వాహనాలను ఆపుతూ గట్టిగా కేకలు వేశానని చెప్పారు. ఈ భయానక దృశ్యం ఒక సినిమాను తలపించిందని, ఆ సమయంలో తనను ఎవరూ వీడియో తీయకపోవడం అదృష్టమని ఆమె పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. తనపై దుండగుడు దాదాపు పదిసార్లు కత్తితో దాడి చేశాడని తెలిపారు. తన కుమారుడు తైమూర్ భయపడిపోయి, “నాన్నా.. నువ్వు చనిపోతావా?” అని అడిగిన క్షణాలు తనను ఎంతగానో కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ దుండగుడు ఉపయోగించిన కత్తి నాసిరకం కావడంతోనే తాను ప్రాణాలతో బయటపడగలిగానని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన తెలిపారు. దాడి జరిగిన రోజు రాత్రి ఇంట్లో డ్రైవర్లు ఎవరూ లేకపోవడం వల్ల ఆసుపత్రికి చేర్చడంలో మరింత ఇబ్బంది అయిందని వెల్లడించారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో తాను చాలా ప్రశాంతంగా కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వచ్చాయని, అసలు దాడి జరిగిందా లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారని సైఫ్ గుర్తుచేశారు. బయటకు తాము ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ ఘటన తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిందని కరీనా తెలిపారు. ఆ భయానక అనుభవం కారణంగా దాదాపు ఆరు నెలల పాటు తమకు సరిగ్గా నిద్రపట్టలేదని ఆవేదన వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

