ఇస్మార్ట్ బ్యూటీతో ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో సోనూసూద్- వీడియో

ఒకప్పుడు విలన్ పాత్రలతో ప్రేక్షకులని మెప్పించిన సోనూసూద్ కరోనా మహమ్మారీ నేపథ్యంలో ఆపత్కాల బాంధవుడిగా ప్రజల్లో ఓ వెలుగు వెలిగారు. రియల్ హీరోగా ఆయనని అభిమానులు ఆరాధిస్తున్నారు. రాను రాను సోనూసూద్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. అతనిని కలిసేందుకు అభిమానులు కిలో మీటర్ల మేర పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు సోనూని నెగెటివ్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.
సోనూసూద్ ప్రస్తుతం ఓ మ్యూజిక్ ఆల్భమ్ చేస్తున్న విషయం తెలిసిందే . నిధి అగర్వాల్ తో నటించిన కొత్త హిందీ మ్యూజిక్ వీడియో సాథ్ క్యా నిభావోగే నేడు విడుదలైంది. దీనికి ఫరా ఖాన్ కొరియోగ్రఫీ కం డైరెక్షన్ చేయడం ఆసక్తికరం. ఈ పాటను పంజాబ్ పరిసరాల్లో చిత్రీకరించారు. ఇందదులో నిధితో రొమాన్స్ ని ఓ రేంజులోనే పండించాడు సోనూ. రియల్ హీరోలో ఇంత విషయం ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.
సాథ్ క్యా నిభావోగే అనేది అల్తాఫ్ రాజా తొంబైల నాటి పాట.. టమ్ టు థెహ్రే పరదేశికి రీమిక్స్ వెర్షన్. విడిపోయిన ప్రేమికుల విరహగీతం ఇదని చెప్పొచ్చు. బార్ డ్యాన్సర్ నిధిని కాపాడటానికి సోను ఆరంగేట్రం చేసే తీరును తెరపై ఆవిష్కరించారు. థీమ్ ఆద్యంతం ఆసక్తికరం. అల్తాఫ్ రాజా – టోనీ కక్కర్ ఈ పాటకు గాత్రం అందించారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

