Kartikeya | చివరగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya). క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే తాజాగా రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ ముబారక్ చెబుతూ.. కార్తికేయ 8 (Kartikeya 8) అప్డేట్ అందించాడు. కార్తికేయ ఎనిమిదవ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు.
నేడు ప్రీ లుక్ ఒకటి షేర్ చేస్తూ.. రేపు మధ్యాహ్నం 12:06 గంటలకు ఫస్ట్ లుక్ లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు. సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ యూనిక్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.
సాలిడ్ కంటెంట్‌తో ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ భామ ఐశ్వర్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాధన్ సంగీతం అందిస్తుండగా.. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ కాగా.. పీ అజయ్ కుమార్ రాజు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
కార్తికేయ 8 ప్రీ లుక్..
Title and first look of #Kartikeya8 out on April 12th at 12.06 PM ❤🔥
Stay tuned to find out what happens when life turns upside down with a whirlwind of events 🌀
Eid Mubarak ✨@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @UVConcepts_ @UV_Creations @adityamusic pic.twitter.com/CjwWQJneaw
— UV Creations (@UV_Creations) April 11, 2024