Rules Ranjan Movie | రూల్స్ రంజన్ నుంచి మాస్ బీట్ సాంగ్ రిలీజ్..!
Rules Ranjan Movie Songs | సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కెరీర్ తొలినాళ్లలో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోయిన కిరణ్.. ఆ తర్వాత హిట్టు కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.
Rules Ranjan Movie Songs | సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కెరీర్ తొలినాళ్లలో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోయిన కిరణ్.. ఆ తర్వాత హిట్టు కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అది చాలదన్నట్లు ట్రోలర్ రాయుళ్లకు ఎప్పుడూ టార్గెట్ అవుతూనే ఉంటాడు. ఇక ఆయన సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ చూసి ఏళ్లయిపోయింది. ఆ మధ్య వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక మూడు నెలల కిందట రిలీజైన మీటర్ సినిమాలో మ్యాటర్ లేదని తొలిరోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఆశలన్నీ రూల్స్ రంజన్ సినిమాపైనే ఉన్నాయి.
నిర్మాత ఏ.ఎమ్ రత్నం పెద్ద కొడుకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు గట్రా సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఎందుకురా బాబు అంటూ సాగే మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. అమ్రిష్ స్వరపరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, రేవంత్ ఆలపించారు. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

