Rukmini Vasanth | అవన్నీ ఫేక్.. బికినీ ఫొటోలపై స్పందించిన నటి రుక్మిణి వసంత్
Rukmini Vasanth | 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Rukmini Vasanth | ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రీన్ కలర్ బికినీ ధరించి ఆమె స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్నట్లు ఉన్న ఈ విజువల్స్ నెటిజన్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. చుట్టూ కెమెరాలు, టెక్నీషియన్లు ఉండటంతో ఇది ఏదైనా అధికారిక షూట్ అయ్యి ఉంటుందని కొందరు భావించగా, మరికొందరు మాత్రం ఇది ఏఐ డీప్‌ఫేక్ (AI Deepfake) అయ్యి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు.
అయితే ఈ వివాదంపై తాజాగా నటి రుక్మిణి వసంత్ అధికారికంగా స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నెట్లో తన పేరిట సర్క్యులేట్ అవుతున్న బికినీ చిత్రాలన్నీ పూర్తిగా AI ద్వారా సృష్టించిన నకిలీ ఫోటోలని ఆమె స్పష్టం చేశారు. ఆ చిత్రాలు పూర్తిగా తప్పుడు సమాచారంతో, కల్పితంగా సృష్టించబడినవని ఆమె పేర్కొన్నారు. బాధ్యతారాహిత్యంగా ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ ఇటువంటి మార్ఫింగ్ కంటెంట్‌ను తయారు చేయడం మరియు వాటిని వైరల్ చేయడం తీవ్రమైన నేరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారాన్ని తన టీమ్ చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ ఫోటోలను సృష్టించిన వారిపై, అలాగే వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రచారం కల్పిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు రుక్మిణి వెల్లడించారు. నెటిజన్లు ఎవరూ కూడా ఇటువంటి నకిలీ కంటెంట్‌ను ఇతరులకు షేర్ చేయవద్దని, వాటిని ప్రోత్సహించవద్దని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

