RRR Moive | ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ ప్రదర్శన
అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషన్ అవార్డులను గెలుచుకున్న ట్రిపుల్ఆర్ ఇప్పుడు ఆస్కార్‌పై కన్నేసింది. ఓరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుంచి 'నాటు నాటు' పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది.
Naatu Naatu Song Live Performance | అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకున్న ట్రిపుల్ఆర్ ఇప్పుడు ఆస్కార్‌పై కన్నేసింది. ఓరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇక ఈ వేడుక మార్చి 12న ఘనంగా జరుగనుంది. కాగా గత రెండు, మూడు రోజులగా ఆస్కార్ వేదికపై లైవ్ ప్రదర్శన ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఆస్కార్ అకాడమి నిర్వాహకులు ట్వీట్ చేశారు.
మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని అకాడమి వెల్లడించింది. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. ఆస్కార్ వంటి గొప్ప వేదికపై మనవాళ్లు లైఫ్ ప్రదర్శన ఇస్తున్నారంటే తెలుగు వారందరికీ గర్వకారణం. ఇక దీనిపై రాహుల్ సిప్లిగంజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని సందర్భం అని, ఆ క్షణాల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నానని’ ట్వీట్ చేశాడు.
Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars.
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs
— The Academy (@TheAcademy) February 28, 2023
This is going to be unforgettable moment in my life🔥🔥😎 https://t.co/Me1sCKSMxY
— Rahul Sipligunj (@Rahulsipligunj) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

