‘ఆర్ఆర్ఆర్’ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం
ఆర్ఆర్ఆర్' చిత్రంలో గవర్నర్ స్కాట్ పాత్రలో నటించిన బ్రిటీష్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 ఏండ్లు. ఇటలీలో ‘కాసినో ఇన్ ఇస్చియా’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన అక్కడే మృతి చెందారు. రే మరణానికి కారణాలు వెల్లడి కాలేదు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో గవర్నర్ స్కాట్ పాత్రలో నటించిన బ్రిటీష్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 ఏండ్లు. ఇటలీలో ‘కాసినో ఇన్ ఇస్చియా’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన అక్కడే మృతి చెందారు. రే మరణానికి కారణాలు వెల్లడి కాలేదు. రే స్టీవెన్సన్ మృతికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తమ సంతాపాలు తెలియజేశారు. ఎన్టీఆర్ స్పందిస్తూ…‘రే స్టీవెన్సన్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన చాలా త్వరగా మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. రేతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిని అందించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ…‘రే స్టీవెన్సన్ మృతి వార్త షాక్‌కు గురిచేసింది. ఆయన మరణవార్తను నమ్మలేకపోతున్నా. తన ఉత్సాహంతో మా అందరిలోనూ జోష్ నింపేవారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆస్వాదించాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అన్నారు. రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ…‘రే స్టీవెన్సన్ మృతిచెందడం బాధాకరం. మా స్కాట్ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పటికీ మాకు గుర్తుంటారు’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

