కాఫీ విత్ ఏ కిల్లర్
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్'. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘ హీరోహీరోయిన్ లేకుండా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది?
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘ హీరోహీరోయిన్ లేకుండా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. ఈ సినిమాకు కథే హీరో. నా ఆలోచనలను అర్థం చేసుకునే తిరుమల నాగ్‌తో కలిసి ఈ సినిమాకు పనిచేశాను. ఈ సినిమాలోని పాత్రలన్నీ కొత్త ఉంటాయి. ఇందులో హీరోహీరోయిన్లు ఉండరు. విలన్ ఉంటాడు. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. అందరం కలిసి శ్రద్ధగా పనిచేశాం. డీవోపీ అనూష్ అద్భుతమైన పనితనాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయాలని చాలామంది కోరారు. కానీ పట్టుబట్టి మేమే ఓటీటీలో విడుదల చేస్తున్నాం.’ అని తెలిపారు. ఇంకా నిర్మాత సెవన్‌హిల్స్ సతీష్‌తోపాటు ఇందులో ప్రధాన పాత్రధారులైన నటులు జెమినీ సురేశ్, అంబటి శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, టెంపర్ వంశీ, నటి శ్రీరాప కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

