Roti Kapda Romance | విడుదల తేదీ ప్రకటించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’
Roti Kapda Romance | ‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.
Roti Kapda Romance | ‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాను మొదట అక్టోబర్ 04 విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా మరో విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘నేటి యువతరంకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రంలోని ప్రతి పాత్ర అందరికి ప్రతి యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా వుంటుంది. రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ట్రయిలర్‌కు మంచి స్పందన వచ్చింది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే వుద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను తీశాం. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. సినిమా విజయం గురించి ఎలాంటి డౌట్ లేదు. తప్పకుండా హిట్ కొడుతున్నాం. అయితే ఏది ఏ రేంజ్ అనేది ఆడియన్స్ చేతిలో వుంది. ఇదొక ఎమోషన్ల్ రైడ్. లవ్, ఎమోషన్ వుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ చిత్రంలో వుంటాయి’ అన్నారు.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి, కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ భైరి, ప్రతిభా రెడ్డి. అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె, డీఓపీ: సంతోష్ రెడ్డి, సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి. పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి. భరత్ రెడ్డి. ఎడిటర్: విజయ్ వర్థన్. నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

