Rishab Shetty | కాంతార సీక్వెల్ కోసం రిషబ్ శెట్టి భారీ ట్రాన్స్ఫర్మేషన్.. వామ్మో అన్ని కిలోల బరువు తగ్గాడా?
Rishab Shetty | గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ‘కాంతార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. భాషతో సంబంధంలేకుండా ప్రతీ ఏరియాలో ఓ ఊపే ఊపేసింది.
Rishab Shetty | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. దర్శకుడిగా రిషబ్‌శెట్టి ఒక మెట్టు ఎక్కితే.. నటుడిగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు. గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ‘కాంతార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. భాషతో సంబంధంలేకుండా ప్రతీ ఏరియాలో ఓ ఊపే ఊపేసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి 11కిలలో బరువ తగ్గాడట. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో బాడీకి పనిచెప్పాడట. ఇక సెకండ్ పార్టు సీక్వెల్లా కాకుండా ప్రీక్వెల్‌లా తెరకెక్కిస్తున్నారట. అంటే రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ప్రీక్వెల్‌లో చూపించబోతున్నాడు. దీని కోసం రిషబ్ గ్రౌండ్‌వర్క్ చాలానే చేశాడట. ఇక తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
తొలిపార్టు ఊహించని రేంజ్లో హిట్టు కావడంతో రిషబ్ శెట్టికి హోంబలే సంస్థ పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దాంతో ప్రీక్వెల్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా రిషబ్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా కాంతార-1లో ఒకరిద్దరూ మినహాయించి పెద్దగా స్టార్ కాస్ట్ ఏమి లేదు. కానీ ప్రీక్వెల్‌లో మాత్రం స్టార్ కాస్ట్‌ను తీసుకోబోతున్నట్లు టాక్. నవంబర్‌లో షూటింగ్‌ను మొదలు ప్టెటి.. ఆరు నెలలు షూటింగ్, ఆపై రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

