Rc15 Movie | కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రామ్‌చరణ్ మూవీ షూటింగ్..!
మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం 'RC15'. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు.
Rc15 Movie | మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘RC15’. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. దాంతో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఇటీవలే రాజమండ్రిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో కర్నూల్లో బిగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్లో కొండారెడ్డి బురుజు దగ్గర చరణ్‌పై కీలక ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో గూస్బంప్స్ తెప్పించే సీన్లలో ఇది కూడా ఒకటని సమాచారం. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరగుతున్నాయట. కాగా జనవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందట. ఇక షూటింగ్ ప్రారంభమై నెలలు గడుస్తున్న రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయకపోవడంతో మెగా అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దాంతో మెగా ఫ్యాన్స్‌ను సంతోష పరిచేందుకు ఆర్సీ15 మేకర్స్.. చరణ్ పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, అంజలీ, ఎస్.జే సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

