Rc15 Movie | కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర RC15 మూవీ షూటింగ్..!
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చార్మినార్ దగ్గర జరుగుబోతుందట.
RC15 Movie | మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘RC15’. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. దాంతో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
గురువారం చార్మినార్ వద్ద కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం తాజాగా కర్నూల్లో లాండ్ అయింది. కొండారెడ్డి బురుజు దగ్గర కీలక షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ను పరిశీలనలో ఉంచారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటి అంజల్, రామ్ చరణ్ భార్యగా కనిపించనుంది.
Rc 15 shooting in kurnool 💥#Kurnool #Rc15 #Ramcharan pic.twitter.com/pDMzGjolrh
— THE O G 「オージー」❤️🔥 (@PKOG_7) February 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

