Rc15 Movie | ఒక్క పాట కోసం ‘RC15’ మేకర్స్ అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారా?
RC15 Movie | ఇండియా గర్వించ దగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ సినిమాలంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేది గ్రాండ్‌నెస్.
RC15 Movie | ఇండియా గర్వించ దగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ సినిమాలంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేది గ్రాండ్‌నెస్. ఈయన సినిమాల్లో ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. బడ్జెట్ ఎంతైనా సరే శంకర్ అనుకున్న అవుట్‌పుట్ వచ్చేంతవరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ విషయంలో శంకర్ అస్సలు తగ్గడు. అందుకే ఈయన పాటలు స్క్రీన్‌పై అంత అద్భుతంగా కనిపిస్తాయి. కేవలం ఈయన సినిమాల్లోని పాటలు చూడటానికే రిపీటెడ్‌గా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులున్నారు. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌పైన కనిపిస్తుంది. శంకర్ ఒక్క పాటపై పెట్టే బడ్జెట్లో ఓ మీడియం రేంజ్ హీరో సినిమా తీసేయోచ్చు.
ఆ విధంగా శంకర్ పాటలను రూపొందిస్తాడు. అయితే ఇప్పుడు అదే విషయం RC15లో జరుగుతుంది. ప్రస్తుతం శంకర్, రామ్‌చరణ్‌తో RC15 చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఓ పాట కోసం మేకర్స్ రూ.15 కోట్లు ఖర్చుచేయనున్నారట. ఈ పాటను 12 రోజులు షూట్ చేస్తారట. ఇదే నిజమైతే సౌత్ ఇండియాలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ పాటగా ఇది నిలవనుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి లీకైన చరణ్ ఫోటోలకు విశేష స్పందన వచ్చింది. రామ్‌చరణ్‌కు జోడీగా కియరా అద్వాని, అంజలిలు నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

