Ravanasura Movie | రవితేజ ఊరమాస్.. ఆసక్తి రేకెత్తిస్తున్న రావణాసుర ట్రైలర్
Ravanasura Trailer | రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత గతేడాది ధమాకాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కు టచ్ చేసింది. రవితేజ కెరీర్లో తొలి వందకోట్ల సినిమాగా ధమాకా నిలిచింది. ప్రస్తుతం అదే జోష్‌తో రవితేజ రావణాసురు సినమా చేస్తున్నాడు.
Ravanasura Trailer | మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో ‘ధమాకా’ అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెయిన్ హీరో చిరునే అయినా.. సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ రవితేజకే దక్కింది. ప్రస్తుతం రవితేజ హ్యాట్రిక్‌పై కన్నేశాడు. ఆయన హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక సినిమాలోని పాటలైతే ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతుంది. మేకర్స్ టీజర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు. ఓ క్రిమినల్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే వేట ఇదని స్పష్టమవుతుంది. టీజర్లో రవితేజ యాక్షన్ యాంగిల్‌ను చూపించగా, ట్రయిలర్లో రవితేజ మార్క్ కామెడీ కనిపిస్తుంది. ఓ వైపు సాఫ్ట్ క్యారెక్టర్ మరోవైపు వైల్డ్ క్యారెక్టర్లలో రవితేజ నటన వేరే లెవల్లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సుశాంత్‌కు కూడా ఈ సినిమాలో మంచి పాత్రే దక్కినట్లుంది. ముఖ్యంగా హర్షవర్ధన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను ఎక్కడితో తీసుకెళ్లిపోయింది. ‘మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా చేయడం ఆర్ట్.. ఐ యామ్ ఎన్ ఆర్టిస్ట్’ ‘ఈ భూమి మీద నన్నేవడైనా ఆపగలిగే వాడున్నాడంటే అది నేనే’ అనే డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా ట్రైలర్‌ను బాగా కట్ చేశారు.
ట్రైలర్ గమనిస్తే రవితేజ లాయర్ పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మొత్తంగా టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

