Dhamaka Movie | ఓటీటీలోకి వచ్చేసిన ధమాకా మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి.
Dhamaka Movie On OTT | ‘క్రాక్’తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ వీక్‌లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. రవితేజ కెరీర్లో తొలి వంద కోట్ల గ్రాస్ సినిమా ఇదే అవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ధమాకా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్థరాత్రి నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-మాటలు అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

