ఇద్దరు నాయికలతో ఆటపాట

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్‌ను తీసుకున్నారు. తాజాగా మరో ప్రధాన నాయిక పాత్ర కోసం మలయాళ నటి రాజీషా విజయన్ను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు చిత్రసీమకు పరిచయం కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ప్రభుత్వ అధికారిగా రవితేజ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రవితేజతో పాటు దివ్యాంశ కౌశిక్, రాజీషాలపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం’ అని తెలిపారు. నాజర్, వీకే నరేష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

