గ్లామర్ ఇండస్ట్రీలో ఎవరెవరి మధ్య ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఎవరు చెప్పలేం. ఇప్పుడు కన్నడ బ్యూటీ నవ్య స్వామి, బిగ్ బాస్ ఫేం రవికృష్ణ మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. నవ్య స్వామి నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఆమె కథ సీరియల్లో రవికృష్ణతో నటించిన నవ్య స్వామి అతని ప్రేమలో పడినట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
పుకార్లపై పలు సార్లు స్పందించిన నవ్య వాటిని కొట్టి పారేసింది. తాజాగా ఓ నెటిజన్ ‘గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. అతడికి బ్రేకప్ చెప్పాక రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రవికృష్ణ పలుమార్లు నవ్య స్వామి ఫొటోలకు లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడం కూడా నెటిజన్స్ లో అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది.