Ravi Babu | హీరోల యాటిట్యూడ్‌పై వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌ని కాదంటూ రవిబాబు క్లారిటీ
Ravi Babu | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు రవిబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. కథ ఏదైనా సరే దానికి వినూత్న ట్రీట్మెంట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేసిన రవిబాబు.. తాజాగా ‘రేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Ravi Babu | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు రవిబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. కథ ఏదైనా సరే దానికి వినూత్న ట్రీట్మెంట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేసిన రవిబాబు.. తాజాగా ‘రేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.రేజర్ మే 8న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ, “ఒక్క హిట్ వచ్చినా హీరోల బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. కళ్లజోడు పెట్టుకుని బిల్డప్పులు కొడతారు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు నేరుగా అల్లు అర్జున్‌ని ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ముఖ్యంగా పుష్ప 2: ది రూల్‌తో భారీ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ప్రవర్తనను ఉద్దేశించారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై తాజాగా స్పందించిన రవిబాబు, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.నేను సోషల్ మీడియాలో లేను. నేను ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతున్న విషయాలపై మాత్రమే మాట్లాడాను అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రమోషన్ల సమయంలో ఆయన ప్రవర్తనపై సోషల్ మీడియాలో పలు చర్చలు జరిగాయి. ‘తగ్గేదేలే’ అనే పాత్ర యాటిట్యూడ్‌ను బయట కూడా చూపిస్తున్నారని, కొంతమంది అది అహంకారంగా కనిపిస్తోందని విమర్శించారు.ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లలో ఆయన బాడీ లాంగ్వేజ్, సమాధానాల తీరు కూడా ట్రోలింగ్‌కు గురైంది. అలాగే ఆయనను కలవాలంటే కఠిన ప్రోటోకాల్ పాటించాలన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.వివాదాల్ని పక్కనబెడితే, రవిబాబు ప్రస్తుతం రేజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.అడవి నేపథ్యంలో జరిగే ఈ కథలో, మనుషుల కంటే జంతువులే ఎక్కువ వివేకంతో ప్రవర్తిస్తాయనే కాన్సెప్ట్‌ను చూపించనున్నారు. ముఖ్యంగా సినిమాలో కనిపించే కుక్క పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రానికి వైదీ సంగీతం అందించగా, ‘ఫ్లయింగ్ ఫ్రాగ్స్’ బ్యానర్‌పై రవిబాబు స్వయంగా నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ కూడా హైలైట్‌గా ఉండనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- glimpse
- New Film
- raser
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

