Ravanasura Movie | రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్.. సింగర్‌గానూ రవితేజ అదరగొట్టాడు
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు అదే జోష్‌తో సెట్స్మీదున్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హ్యట్రిక్‌పై కన్నేశాడు.
Ravanasura Second Single | ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు అదే జోష్‌తో సెట్స్మీదున్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హ్యట్రిక్‌పై కన్నేశాడు. రవితేజ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవలే రిలీజైన రావణాసుర ఆంథమ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్యార్‌లోన పాగల్ అంటూ సాగే బ్రేకప్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటను స్వయంగా రవితేజ ఆలపించాడు. లేటెస్ట్గా విడుదలైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వర పరిచిన ఈ ట్యూన్ ఫ్రెష్‌గా, క్చాచీగా ఉంది. దానికి తగ్గట్లే కాసర్ల సాహిత్యం కిక్కిచ్చేలా ఉంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఈ సాంగ్ జరుగనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు పాట థీమ్‌తో తను ఫరియాను ప్రేమించి మోసిపోయినట్లు, ఫరియా రిసెస్షన్లో ఈ పాటను ఆలపించినట్లు లిరికల్ సాంగ్ చూస్తే తెలుస్తుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

