The Red Bag | ‘సావిత్రి’ ఆటనే మార్చేస్తుందట.. ది రెడ్ బ్యాగ్ టీంలో జాయిన్ అయిన రాశీ
The Red Bag | మేకర్స్ షేర్ చేసిన ‘ది రెడ్ బ్యాగ్’(The Red Bag) కొత్త అప్డేట్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. రాశీ టీంలో జాయిన్ అయినట్టు తెలియజేస్తూ నయా అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. సావిత్రి పాత్ర సినిమాకు బ్యాక్ బోన్‌గా ఉండబోతున్నట్టు తాజా న్యూస్ హింట్ ఇచ్చేస్తుంది.
The Red Bag | రవికుమార్ సీరపు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’(The Red Bag). హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీలో పాపులర్ నటి రాశీ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ మేకర్స్ షేర్ చేసిన కొత్త అప్డేట్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. రాశీ టీంలో జాయిన్ అయినట్టు తెలియజేస్తూ.. కొన్ని పాత్రలు కేవలం కథకు సపోర్ట్‌గా నిలుస్తాయి. కానీ సావిత్రి మాత్రం మొత్తం ఆటనే మార్చేస్తుంది.. అంటూ నయా అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.
సావిత్రి పాత్ర సినిమాకు బ్యాక్ బోన్‌గా ఉండబోతున్నట్టు తాజా న్యూస్ హింట్ ఇచ్చేస్తుంది. రాధ్య, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి ఈ మూవీలో ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ది రెడ్ బ్యాగ్ మూవీ ప్రీ లుక్‌లో నలుగురు అమ్మాయిలతో రిలీజ్ చేసిన పోస్టర్‌తో బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. మరో పోస్టర్లో చేతినిండా రక్తం, ఆ బ్యాగును పట్టుకున్న తీరు, అక్కడే ఉన్న కత్తులు, తుపాకులు, రక్తపుమయంగా మారిన ఏరియా ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
రవికుమార్ సీరపు ది రెడ్ బ్యాగ్‌కు దర్శకత్వం వహిస్తుండటమే కాకుండా కథ, కథనం సమకూరుస్తున్నాడు. నిర్మాత హరికృష్ణ సోమిశెట్టికి డెబ్యూ సినిమానే అయినా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఇంతకీ ది రెడ్ బ్యాగులో ఏముంది.. అనేది టీజర్‌తో ఏమైనా హింట్ ఇస్తారేమో చూడాలి.
“Some characters just support the story…
But Savitri changes the entire game.” ✨🔥Presenting Actress Raasi Garu as “Savitri” from The Red Bag. ❤️🔥@sravi52892 #TheRedBag #FirstLook #ActionThriller #MemoryMakers #raasiactress #Raadya #HarikrishnaSomisetty #Kiran… pic.twitter.com/uvW26pwVbI
— SR PROMOTIONS (@SRPROMOTIONS29) May 17, 2026
Read Also :
Peddi Trailer | పెద్ది ఏమైనా దేవుడి పేరా..? నా ఫేవరేట్ క్రికెటర్, రెజ్లర్, రన్నర్.. స్టన్నింగ్‌గా రాంచరణ్ పెద్ది ట్రైలర్
Watch: గన్ గురిపెట్టి జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే?
Road accident | రోడ్డు పక్కన రాతి గోడను డీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

