Rashmika | ‘రాకా’లో విలన్‌గా రష్మిక … లగడపాటి శ్రీధర్ వ్యాఖ్యలతో మళ్లీ హాట్‌టాపిక్‌గా అల్లు అర్జున్-అట్లీ సినిమా
Rashmika | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన ప్రచారం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Rashmika | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన ప్రచారం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచే ‘రాకా’ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోందని, ఇందులో రష్మిక మందన్న పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె క్రూరమైన రక్తపిశాచి (వాంపైర్) తరహా నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. రష్మిక పాత్రపై తనకు పూర్తి సమాచారం లేదని చెబుతూనే, ఒకవేళ ప్రచారంలో ఉన్నట్లుగా ఆమె డార్క్ షేడ్స్ ఉన్న ప్రతినాయక పాత్రలో నటిస్తుంటే అది ఆమె కెరీర్లోనే అతిపెద్ద ఛాలెంజ్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.రష్మిక పాత్ర గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కానీ ఆమె నిజంగానే ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుంటే, అది నటిగా ఆమెకు కొత్త మైలురాయిగా నిలుస్తుంది. ఇప్పటివరకు ప్రేక్షకులు ఆమెను గ్లామరస్, ఎమోషనల్ పాత్రల్లో ఎక్కువగా ఆదరించారు. ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తే ఆమె ఇమేజ్‌కు కొత్త కోణం జతకానుంది. దర్శకుడు అట్లీ ఆ పాత్రను ఎలా డిజైన్ చేశారో చూడాలి అని లగడపాటి శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో ‘రాకా’లో రష్మిక పాత్రపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఆమె పాత్రకు సంబంధించిన ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే.. ‘పుష్ప’ ఫ్రాంచైజీలో శ్రీవల్లి, పుష్పరాజ్‌గా ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈసారి పూర్తిగా భిన్నమైన స్క్రీన్ డైనమిక్స్‌తో కనిపించనున్నారనే ప్రచారం. ప్రేమికులుగా ఆకట్టుకున్న ఈ జంట, ఒకవేళ ‘రాకా’లో ఒకరిపై ఒకరు తలపడే పాత్రల్లో కనిపిస్తే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ పాత్రలు, కథకు సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్స్ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- kaarthi
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

