మట్టి వణికింది రక్తాన్ని దాచలేక..
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘మైసా’. ఇందులో ఆమె గోండు తెగకు చెందిన యోధురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘మైసా’. ఇందులో ఆమె గోండు తెగకు చెందిన యోధురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. ‘నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక.. గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరిని మోయలేక..అగ్గే బూడిదయింది మండుతున్న నా బిడ్డను చూడలేక..ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక.. నా బిడ్డ ఎవరో తెలుసా?” అంటూ కథానాయిక తల్లి వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది.
రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని రా అండ్ వయొలెంట్ క్యారెక్టర్లో కనిపించింది. రక్తమోడుతున్న దుస్తులతో ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ‘మైసా’ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న వీరనారిగా రష్మిక మందన్న పాత్ర అత్యంత శక్తివంతంగా అనిపించింది. ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నామని, రష్మిక మందన్న కెరీర్లో మైలురాయిలా నిలిచే చిత్రవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

