Nithiin 33 | సెట్స్ మీదకు మరో క్రేజీ కాంబో.. నితిన్‌కు జోడీగా రష్మిక మందన్నా?
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొన్నేళ్ల నుండి నితిన్ సినిమాలు ఏదో అమవాస్యకు ఒకసారి పలకరించినట్లు ఒక సినిమా హిట్టయితే వరుసగా రెండు, మూడు ఫ్లాపులు పడుతున్నాయి.
Nithiin-Venky Kudumula Movie | యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొన్నేళ్ల నుండి నితిన్ సినిమాలు ఏదో అమవాస్యకు ఒకసారి పలకరించినట్లు ఒక సినిమా హిట్టయితే వరుసగా రెండు, మూడు ఫ్లాపులు పడుతున్నాయి. నితిన్ కూడా ఒకే జానర్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తున్నాడు. కాగా గతేడాది తన జానర్‌కు భిన్నంగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సారి కూడా నితిన్‌కు భారీ పరాజయమే ఎదురైంది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ అయింది.
కాగా ఈ సినిమా తర్వాత నితిన్ భీష్మ దర్శకుడు వెంకీ కుడుమలతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్రంబృందం. అయితే ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా మరోసారి రష్మికనే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. భీష్మలో వీళ్ల జోడీ పర్ఫెక్ట్గా సెట్ అవడంతో మరోసారి ఇదే జోడీని కంటిన్యూ చేయాలని వెంకీ కుడుముల భావిస్తున్నాడు. త్వరలోనే రష్మికకు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడట. ఇక ప్రస్తుతం రష్మికకు పుష్ప తప్పితే మరో తెలుగు ప్రాజెక్ట్ లేదు. పైగా టాలీవుడ్లో తనకు లైఫ్ ఇచ్చిన వెంకీ కుడుమలతో సినిమాకు నో చెప్పే చాన్సే లేదు. అన్ని కుదిరితే మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీతో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

