Rashmika | జపాన్ టోక్యోలో రష్మిక సందడి చేస్తున్నారు. అభిమానులతో ఆమె ఇంటరాక్టవుతూ సరదాసరదాగా గడుపుతున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ మీడియాతో ఆమె చిట్‌చాట్ నిర్వహించారు. ‘జపాన్ వెళ్లడం నా చిన్ననాటి కల. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఇక్కడి ఆహారం, వాతావరణం స్వచ్ఛంగా ఉన్నాయి. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్‌లో నేనూ భాగం అవ్వడం గర్వంగా ఉంది. ఇక్కడివారి ప్రవర్తన, వారి మర్యాద నన్ను కట్టిపడేశాయి’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది రష్మిక.
ఇంకా చెబుతూ ‘పుష్ప’ సినిమాకు ఇక్కడ అభిమానులున్నారు. అందుకే.. ‘పుష్ప2’ను జపాన్‌లో కూడా విడుదల చేస్తే బావుంటుందనే ఆలోచనలో మా టీమ్ ఉంది. ఆగస్ట్ 15న ‘పుష్ప2’ విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే డేట్‌కే ఇక్కడ కూడా విడుదల కావొచ్చు.’ అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది రష్మిక.