Rashmika Mandanna | ఆ సినిమా నటిగా నా ఆకలి తీర్చింది.. నేషనల్ క్రష్ రష్మిక
సినిమాలమీద సినిమాలు సైన్ చేసుకుంటూ, విజయాలపై విజయాలు సాధిస్తూ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది రష్మిక. ప్రస్తుతం ఆమె నటించిన ‘యానిమల్' ఓ సంచలనం. అందులో రష్మిక నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
Rashmika Mandanna | సినిమాలమీద సినిమాలు సైన్ చేసుకుంటూ, విజయాలపై విజయాలు సాధిస్తూ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది రష్మిక. ప్రస్తుతం ఆమె నటించిన ‘యానిమల్’ ఓ సంచలనం. అందులో రష్మిక నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ డాల్‌గా మాత్రమే అలరించిన నేషనల్ క్రష్.. తొలిసారి అభినయతారగా కూడా అలరించిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ‘పుష్ప-2’ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నది. అందులో ‘శ్రీవల్లి’గా మరోసారి మురిపించనున్నది రష్మిక. మరోవైపు గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఉండనే ఉంది. త్వరలో మరో సినిమా ఎనౌన్స్మెంట్ కూడా రానుంది. ఈ విధంగా శరవేగంగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నది రష్మిక. తాను చేయబోతున్న పాత్రలు, సినిమాల గురించి ఇటీవల రష్మిక మాట్లాడుతూ ‘అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను. కథ నచ్చాలి. పాత్ర నచ్చాలి. పనిచేసే వ్యక్తులు నచ్చాలి. ఆ తర్వాతే రెమ్యునరేషన్. నా అదృష్టం బావుంది. మంచి సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమా ఇచ్చిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అది’ అని చెప్పుకొచ్చింది రష్మిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

