రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ
హిందీ చిత్రం ‘ఆజాద్'లో ‘ఉయ్ అమ్మ’ అనే పాటతో బాగా పాపులర్ అయింది రషా తడానీ. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీతో పాటు దక్షిణాదిలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది.
హిందీ చిత్రం ‘ఆజాద్’లో ‘ఉయ్ అమ్మ’ అనే పాటతో బాగా పాపులర్ అయింది రషా తడానీ. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీతో పాటు దక్షిణాదిలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది. ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో ఈ సొగసరి తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పి.కిరణ్ నిర్మాత. శుక్రవారం ఈ సినిమా నుంచి రషా తడానీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ని మొదలుపెట్టామని, చక్కటి కుటుంబ కథగా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

